కాళోజీ ఆరోగ్య వర్సిటీ వీసీ పోస్టుకు దరఖాస్తు గడువు 6 వరకు పొడిగింపు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వరంగల్‌లో ఉన్న కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ (వీసీ) పోస్టుకు దరఖాస్తు చేసుకునే గడువును వచ్చేనెల ఆరో తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ చోంగ్తు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ పోస్టుకు అర్హులైన వైద్యరంగంలో విద్యావేత్తలుగా ఉన్న వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిం చడం కోసం ఈనెల ఏడో తేదీన నోటిఫికేషన్‌ను జారీ చేశామని తెలిపారు.
అర్హులైన వారు దరఖాస్తుతోపాటు పూర్తిస్థాయి కర్రికులమ్‌ వీటను తాము రూపొందంచిన ప్రొఫార్మ ప్రకారం డాక్యుమెంట్‌ ఆధారాలతో రిజిస్టర్‌ పోస్టు చేయాలని సూచించారు.
ది సెక్రెటరీ టు గవర్నమెంట్‌, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ, రూమ్‌ నెంబర్‌ 17, మొదటి అంతస్తు, డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయం, హైదరాబాద్‌,500022కు దరఖాస్తులను పంపించాలని కోరారు. ఇతర వివరాల కోసం 9140-23455824 నెంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.