వృత్తి నైపుణ్య కోర్సులలో ప్రవేశానికై దరఖాస్తులకు ఆహ్వానం

నవతెలంగాణ – తాడ్వాయి 
వృత్తి నైపుణ్య కోర్సులలో ప్రవేశానికై  దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని సెట్విన్ కోఆర్డినేటర్ నాగేశ్వర్ రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు నెలల కాలపరిమితి గల ఏం.ఎస్. ఆఫీస్, టైలరింగ్/గార్మెంట్ మేకింగ్, బ్యూటీషియన్/అడ్వాన్స్ బ్యూటీషియన్, డి.టి.పి , అకౌంట్స్ ప్యాకేజి కోర్సులలో శిక్షణ  ఇవ్వనున్నామని తెలిపారు. పదవ తరగతి ఉతీర్ణులైన లేదా ఫెయిల్ అయిన అభ్యర్థులు  అర్హులని, కోర్సు ఫీజులో 50 రాయితీ కూడా ఇస్తున్నామని ఆయన తెలిపారు. కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు సెట్విన్ సంస్థ ద్వారా పరీక్షలు నిర్వహించి ఉతీర్ణులైన వారికి  తెలంగాణ ప్రభుత్వ సర్టిఫికెట్ ను అందజేస్తామని, ఈ అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవలసిందిగా ఆయన సూచించారు.