తాత్కాలిక రసాయన శాస్త్ర లెక్చరర్ పోస్ట్ కు దరఖాస్తులు ఆహ్వానం

Applications are invited for the post of Temporary Chemistry Lecturer– ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేందర్
నవతెలంగాణ – రాయపోల్
దౌల్తాబాద్  మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో రసాయన శాస్త్రం  పీరియడ్ ల ( గంటల) ప్రకారం  ప్రాతిపదికన బోధించుటకు బీఎడ్ మరియు పీజీ రసాయన శాస్త్రం పూర్తిచేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేందర్  ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసే అభ్యర్థులు సంబంధిత అర్హత ధ్రువపత్రాలతో తేది 20-07- 2024 శనివారం రోజున నేరుగా పాఠశాలలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 18,200 వరకు వేతనం  ఇవ్వబడును. ఈ నియామకం పూర్తిగా తాత్కాలికం మరియు పీరియడ్ ప్రకారం గౌరవ వేతనం ఇవ్వబడుతుందని తెలిపారు.