షెడ్యూల్డ్ కులాల విద్యార్థినీ, విద్యార్థులకు దరఖాస్తులకు ఆహ్వానం..

నవతెలంగాణ – రెంజల్

జిల్లా షెడ్యూల్డ్ కులాల విద్యార్థినీ విద్యార్థులు చదువుకోవడానికి దరఖాస్తులు చేసుకోవాలని రెంజల్ బాలుర వసతి గృహం వార్డెన్ శ్రీకాంత్ కోరారు. జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి ఆదేశాల మేరకు చదువుపై ఆసక్తి ఉన్న విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో బెస్ట్ అవైలబుల్ కలిగిన పాఠశాలల్లో వారికి చేర్పించడం జరుగుతుందన్నారు. ఒకటవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు 101 సీట్లు, నాన్ రెసిడెన్షియల్ లో, ఐదవ తరగతి విద్యార్థులకు రెసిడెన్షియల్ లో 102 సీట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఆసక్తి గల విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. విద్యార్థిని విద్యార్థులకు సంబంధించిన కుల ధ్రువీకరణ, ఆధార్ కార్డు, రేషన్ కార్డుల జిరాక్స్ ల పై గజిటెడ సంతకం తప్పనిసరిగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గలవారు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఈనెల 19 నుంచి వచ్చే నెల 7వ తారీకు వరకు దరఖాస్తులకు ఆవనిస్తోందని ఆయన తెలిపారు.