గిరిజన బాలబాలికులకు బెస్ట్ అవైలబుల్ కింద దరఖాస్తు ఆహ్వానం..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
గిరిజన బాల/బాలికలకు బెస్ట్ ఆవేలబుల్ పాఠశాల నందు ప్రవేశము కొరకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు ఇన్చార్జి అధికారి  కృష్ణన్ తెలిపారు. 2024-25 విద్యాసంవత్సరమునకు గిరిజన బాలబాలికలకు బెస్ట్ ఆవేలబుల్ స్కూల్ లో ప్రవేశించుటకు గాను (10) సీట్లు ప్రభుత్వము నుండి కేటాయించబడినది.  అందులో 3వ తరగతిలో బాల/ బాలికలకు (5)సీట్లు, 5వ తరగతిలో బాల/బాలికలకు (3)సీట్లు మరియు 8వ తరగతిలో బాల/బాలికలకు (2) సీట్లు కేటాయించడం జరిగింది. దరఖాస్తు ఫారములు ఉచితముగా జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయము, జిల్లా కలెక్టర్ కార్యాలయము రాయిగిరిలో పొంది పూర్తి చేసిన దరఖాస్తులను చివరి తేదీ: 06.06.2024 సా: 5.00 గం.ల లోగా కార్యాలయంలో సమర్పించి రశీదు పొందగలరు. దరఖాస్తుతో పాటు జత పరుచవలసిన ధృవీకరణ పత్రములు కుల, ఆదాయ ధృవీకరణ పత్రము వార్షిక ఆదాయము గ్రామీణ ప్రాంతాల వారికి రూ. 1,50,000/- పట్టణ ప్రాంతాల వారికి రూ. 2,00,000/- లకు మించి వుండరాదు, ఆధర్ కార్డు, రేషన్ కార్డు, ప్రస్తుతము చదువుచున్న పాఠశాల నుండి పొందిన బోనఫైడ్ సర్టిఫికేట్ మరియు (2) లేటెస్ట్ పాస్ పోర్టు సైజ్ ఫోటోలు, గజిటెడ్ అధికారి సంతకముతో జత పరుచవలయును. ఆసక్తి గల గిరిజన బాలుర /బాలికలు ఈ అవకాశమును సద్వినియోగము చేసుకోగలరని కొరనైనది, గడువు తదుపరి అందిన దరఖాస్తులు స్వీకరించబడవని తెలిపారు.