పోచాపూర్ మినీ గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు

నవతెలంగాణ – తాడ్వాయి 
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని బంధాల జిపి పరిధిలో గల పోచాపూర్ గిరిజన మినీ గురుకుల బాలికల పాఠశాలలో 2024- 25 విద్య సంవత్సరానికి లకు అడ్మిషన్లు ప్రారంభమైనట్లు మున్సిపల్ బాల్ నారాయణ నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబిఎస్ఇ లో ఫస్ట్ క్లాస్ లో- 30, సెకండ్ క్లాసులో- 10, థర్డ్ క్లాస్ లో- 10, ఫోర్త్ క్లాస్ లో- 6, ఫిఫ్త్ క్లాస్ లో-7 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. అర్హత గల గిరిజన బాలికలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఒకటవ తరగతి విద్యార్థులకు ఐదు సంవత్సరాలు నిండి ఉండాలని అన్నారు. విద్యార్థులకు ఉచిత భోజనం వసతి యూనిఫామ్ బుక్స్ నోట్ బుక్స్ కాస్మోటిక్ లు అన్ని ఉచితంగా అందచేస్తామని తెలిపారు. అడ్మిషన్ కొరకు చివరి తేదీ 28- 06- 2024 వరకు అన్నారు. పూర్తి వివరాలకు కాంటాక్ట్ నెంబర్స్ 9491653478, 9441776319. సంప్రదించాలని అన్నారు.