నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి టీపీసీసీ దరఖాస్తుల ఆహ్వానాన్ని షురూ చేసింది. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో వాటి స్వీకరణ ప్రారంభమైంది. మార్చి 3వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉన్నది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు రూ.25 వేలు, ఇతరులకు రూ.50 వేల చొప్పున డీడీ రూపంలో పార్టీకి చెల్లించాలని పార్టీ నిర్ణయించింది. అందు కోసం గాంధీభవన్‌లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసింది. మంగళవారం ఆరుగురు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లు రవి నాగర్‌కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి దరఖాస్తు చేసుకున్నారు.