న్యూజిలాండ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2023-24 కోసం దరఖాస్తులు

నవతెలంగాణ – హైదరాబాద్
ఎడ్యుకేషన్ న్యూజిలాండ్ మనాపౌ కి టీ అవో (Manapou ki te Ao) ఇప్పుడు న్యూజిలాండ్ ఎక్సలెన్స్ అవార్డులు2023- 24 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన, ప్రత్యేకమైన స్కాలర్‌షిప్ పథకం విద్యార్థులకు ప్రపంచ స్థాయి న్యూజిలాండ్ విశ్వవిద్యాలయాలలో చదువుకునేందుకు, దేశం సమగ్ర, బహుళ సాంస్కృతిక సమాజాన్ని ఆస్వాదించేందుకు అవకాశాన్ని అందిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్-ఇండియా ఎడ్యుకేషన్ వీక్ సందర్భంగా ఆవిష్కరించిన ఈ అవార్డులు న్యూజిలాండ్ డాలర్ (NZD) 320,000 విలువైన సమగ్ర ప్యాకేజీని కలిగి ఉన్నాయి. స్కాలర్‌షిప్ ప్యాకేజీ ప్రతి విద్యార్థికి న్యూజిలాండ్ డాలర్ (NZD) 10,000 నుంచి న్యూజిలాండ్ డాలర్ (NZD) 20,000 వరకు అవార్డు ఎంపికల శ్రేణిని అందిస్తుంది. ఈ అవార్డులు న్యూజిలాండ్ విశ్వవిద్యాలయాలలో ఒకదానిలో అండర్ గ్రాడ్యుయేట్ మరియు/లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హతలను పొందేందుకు విద్యాభ్యాసం చేసేందుకు ఉన్నత స్థాయిలో భారతీయ విద్యార్థులను ప్రోత్సహించేలా రూపొందించగా, ఇవన్నీ 2023 క్యూఎస్ ప్రపంచ ర్యాంకింగ్‌లలో టాప్ 500లో ఉన్నాయి. దీని గురించి ఎడ్యుకేషన్ న్యూజిలాండ్ ఆసియా విభాగం ప్రాంతీయ డైరెక్టర్ బెన్ బర్రోస్ మాట్లాడుతూ, ‘‘న్యూజిలాండ్ ఎక్సలెన్స్ అవార్డులను 2016లో ప్రారంభించినప్పటి నుంచి, వీటిని 200 మంది భారతీయ విద్యార్థులకు మా ఎనిమిది విశ్వవిద్యాలయాలలో ఒకదానిలో ప్రపంచ స్థాయి విద్య ద్వారా, ప్రపంచ పౌరసత్వ ప్రయాణంలో కొనసాగేందుకు మద్దతునిచ్చాయి’’ అని వివరించారు. ‘‘ఈ అవార్డు గ్రహీతలు మా క్యాంపస్‌లలో ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్‌ను సుసంపన్నం చేసేందుకు అందించిన సహకారం అమూల్యమైనది. ఈ ఏడాది, అటువంటి మరింత మంది ఆశావహుల కలలకు మద్దతుగా ఈ అవార్డులలో అతిపెద్ద పెట్టుబడిని మేము ప్రకటించాము. ఇది భారతదేశం పట్ల మా నిబద్ధతను, పరస్పర ప్రయోజనాల కోసం మరిన్ని ప్రాజెక్టులు మరియు కార్యక్రమాలను రూపొందించేందుకు న్యూజిలాండ్-భారతదేశ విద్యా సంబంధాన్ని విస్తరించే మా ప్రణాళికలను కూడా సూచిస్తుంది’’ అని బర్రోస్ వివరించారు.
న్యూజిలాండ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2023 గురించి మరిన్ని వివరాలు
ఈ అవార్డులు ఎడ్యుకేషన్ న్యూజిలాండ్, మొత్తం ఎనిమిది న్యూజిలాండ్ విశ్వవిద్యాలయాల సంయుక్త చొరవ. ఇవి 2023 క్యూఎస్ ప్రపంచ ర్యాంకింగ్‌ల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 500 విశ్వవిద్యాలయాలలో ర్యాంక్ పొందాయి. ఈ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులను అక్టోబర్ 15, 2023లోగా చేసుకోవలసి ఉంటుంది. ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ గురించి సమగ్ర వివరాల కోసం, దయచేసి here. క్లిక్ చేయండి.