– కోఆర్డినేటర్ సయ్యద్ మొయిజుద్దీన్
నవతెలంగాణ – కామారెడ్డి
సెట్విన్ టెక్నికల్ శిక్షణ ఇనిస్టిట్యూట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ద్వారా వివిధ వృత్తివిద్య కోర్సుల్లో శిక్షణ ఇవ్వనట్లు తెలంగాణ ప్రభుత్వ కోఆర్డినేటర్ సయ్యద్ మొయిజుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. డిసిఏ, పిజి డిసిఏ, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటిషన్, మగ్గం వర్క్, మోహందీ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఉచిత స్టడీ మెటీరియల్ తో పాటు కోర్స్ ఫీజులో 50 శాతం రాయితీ కల్పిస్తామని పేర్కొన్నారు. కోర్సు పూర్తి చేసిన తర్వాత సెట్విన్ ప్రభుత్వ సంస్థ ద్వారా సర్టిఫికెట్ అందజేస్తామని పూర్తి వివరాలకు నెంబర్లను 738618 0456,79891 59121 సంప్రదించాలని కోరారు. ఆసక్తి ఉన్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.