
నవతెలంగాణ – భువనగిరి రూరల్
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏ భాస్కర రావు, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి వీరారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు కలెక్టరేటు కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వారు ప్రజల నుండి 34 దరఖాస్తులను స్వీకరించారు. ఇందులో రెవిన్యూ శాఖ 24, జిల్లా పంచాయతీ అధికారి 5, జిల్లా ఉపాధి కల్పన శాఖ 2, మున్సిపాలిటీ, రోడ్లు భవనాల శాఖ, సాంఘిక సంక్షేమ శాఖలు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి పద్మజారాణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.