నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీలను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. సోమవారం నాడు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుండి 55 అర్జీలను స్వీకరించారు. సంబంధిత అధికారులు దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నా రు. అందులో రెవిన్యూ శాఖ 36,జిల్లా పంచాయితీ శాఖ 6, హౌసింగ్ 5, జిల్లా సంక్షేమ శాఖ 3, మున్సిపాలిటీ 2, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ 2, ఫుడ్ సేఫ్టీ 1 వచ్చాయి. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లడుతూ స్టేట్ ప్రజావాణి లో మన జిల్లా కి సంబంధిచిన దరఖాస్తులను కూడా పూర్తి స్థాయి లో పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ కోరారు. శాఖల వారీగా పూర్తి స్టాయి లో సమీక్ష లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.అధికారులు ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తి స్థాయి లో ప్రతేక్య శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్, ముఖ్య కార్య నిర్వహణ అధికారి శోభ రాణి , జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి నాగి రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.