దరఖాస్తులను పరిశీలించి తీసుకోవాలి జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం మండలంలోని జాతర్ల గ్రామంలో కొనసాగుతున్న ప్రజా పాలన గ్రామ సభలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గ్రామ సభల్లో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సభల్లో 5 గ్యారెంటీ పథకాల కోసమే కాకుండా ఇంకా వేరే సమస్యల గురించి ఏమైనా దరఖాస్తులు వస్తున్నాయా అని అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక అధికారులు, గ్రామసభ బృందాలు గ్రామసభలను ఓపికగా నిర్వహించాలని, ప్రజలకు ఆయా పథకాలపై ఉన్న అనుమానాలు, సందేహాలను నివృత్తి చేయాలని బాధ్యతగా పనిచేయాలని ఆయన కోరారు. అనంతరం దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ సభల్లో ఎక్కువగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు కలెక్టర్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి మోహన్, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు.