స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలి 

Apply for admissions in Skill University– కోర్సు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం 
– ఈ నెల 29తో ముగుస్తున్న గడువు 
– మైనారిటీ జిల్లా అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా 
నవతెలంగాణ – పాల్వంచ 
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో అందిస్తున్న పలు కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ యూనివర్సిటీలో 1. స్కూల్ ఆఫ్ హెల్త్ కేర్ 2. స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్ 3. స్కూల్ ఆఫ్ లాజిస్టిక్స్ మరియు ఇ-కామర్స్ వంటి విభాగాల్లో పలు కోర్సులను అందించడం జరుగుతుందన్నారు. స్కూల్ ఆఫ్ హెల్త్ కేర్ లో నర్సింగ్ ఎక్స్ లెన్స్ ఫినిషింగ్ స్కిల్స్ సర్టిఫికేషన్ ప్రోగ్రాం నేర్చుకునేందుకు జి.ఎన్.ఎం, బి.ఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బి.ఎస్సీ నర్సింగ్ చదివిన వారు అర్హులవుతారన్నారు. ఈ కోర్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు అర్హులు అని, కోర్సు వ్యవధి కాలం 3 నెలలు ఉంటుందని తెలిపారు. కోర్సు ఫీజు రూ.30 వేలు ఉంటుందని చెప్పారు. స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ లైఫ్ సైన్సెస్ లో ఫార్మా అసోసియేట్ ప్రోగ్రాం ను బి.ఎస్సీలో కెమిస్ట్రీ ఒక సబ్జెక్టు కలిగి ఉన్నవారికి 6 నెలల పాటు శిక్షణ అందిస్తారని అన్నారు. ఈ కోర్సు ఫీజు రూ.5 వేలు ఉంటుందన్నారు. శిక్షణా కాలంలో అభ్యర్థులకు నెలకు రూ. 17500/- లు స్టైఫండ్ అందిస్తుందని తెలిపారు. స్కూల్ ఆఫ్ లాజిస్టిక్స్ మరియు ఇ-కామర్స్ నందు వేర్ హౌస్ ఎక్జిక్యూటివ్ సర్టిఫికెట్ ప్రోగ్రాం మూడున్నర నెలలు అందిస్తారని, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై 18 నుంచి 26 సంవత్సరాల లోపు గలవారు ఈ కోర్సులో ప్రవేశానికి అర్హులని చెప్పారు. కోర్సు ఫీజు రూ.12 వేలు ఉంటుందని చెప్పారు. పైన తెలిపిన కోర్సులు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 29వ తేదీ లోపు తమ వివరాలను www.yisu.in వెబ్ సైట్ నందు ఆన్లైన్ చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఫోన్ నెంబర్ 8520860785ను సంప్రదించాన్నారు.