దళిత బంధు కోసం అప్లికేషన్ చేసుకోండి: ఎంపీడీవో జోహార్ రెడ్డి

నవతెలంగాణ-ధర్మసాగర్
షెడ్యూల్ కులాలకు సంబంధించిన వారు దళిత బంధు అప్లికేషన్ నేరుగా (ఆఫ్లైన్లో) చేసుకోవాలని ఎంపీడీవో జోహార్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఆయన పత్రిక సమావేశాన్ని నిర్వహించి మాట్లాడుతూ దళితబందు పథకం కొరకు ధర్మసాగర్ గ్రామ పరిథిలోని షెడ్యూల్డు కులంనకు  చెందిన వారు ఈనెల 12వ తేదీ లోపు ధర్మసాగర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో  స్వయంగా  దరఖాస్తు చేసుకోవాలని ఇందుకు సంబంధించి జతపరచవలసిన డాక్యుమెంట్లు 1).దరఖాస్తుదారుని ఫోటో  2).ఆధార్ కార్డు 3).రేషన్ కార్డు. 4).వివాహ ధ్రువీకరణ పత్రం 5).కుల ధ్రువీకరణ పత్రం 6). ఆదాయ ధ్రువీకరణ పత్రం 7). ఓటర్ ఐడి     మొదలైనవి డాక్యుమెంట్లు జతపరిచబడి ఉంటుందని తెలిపారు. ఈ సదా అవకాశాన్ని మండల ప్రజలు ఉపయోగించుకునే ఆర్థికంగా ఎదగాలని ఆయన సూచించారు.