– ట్రస్మా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు
నవతెలంగాణ – జన్నారం
వచ్చే పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల కోసం ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని, ట్రస్మా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన పత్రికా విలేకరులతో వారు మాట్లాడుతూ.. 2021 నవంబర్ ఆరవ తేదీ వరకు ఉన్న పట్టభద్రుడు తప్పనిసరిగా తమ ఓటు నమోదు చేసుకోవాలన్నారు. అందుకుగాను దరఖాస్తు ఫారంతో సహా డిగ్రీ మేమొ,ఆధార్ కార్డు ఒక ఫోటోతో ఫామ్ నింపి గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి తాసిల్దార్ కార్యాలయంలో అందించాలన్నారు. అలాగే ఆదిలాబాద్ నిజాంబాద్ మెదక్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల, పట్టభద్రుల ఎమ్మెల్సీగా అన్ని కుల సంఘాలు అన్ని పార్టీల మద్దతుతో తన బరిలో ఉంటున్నానని స్థానికుడైన తనకు ఓటు వేసి పట్టభద్రులు భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. నిరుద్యోగుల కోసం ఉద్యోగుల కోసం పట్టభద్రుల కోసం, ప్రవేట్ పాఠశాలల కోసం తన గలాన్ని శాసన మండల లో వినిపిస్తా అన్నారు. ప్రతి ఒక్కరు తప్పకుండా తమ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు.