గృహాలక్ష్మీ పథకానికి రేపటిలోగా దరఖాస్తు చేసుకోవాలి

– ఎంపీడీవో మధుసూదన్‌
నవతెలంగాణ-కోహెడ
తెల్లరేషన్‌ కార్డులు కలిగి ఉన్న పేద గృహిణిలు, ఒంటరి మహిళలు గృహలక్ష్మి ద్వారా స్వంత ఇళ్లు నిర్మించుకునేందుకు రేపటిలోగా దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో మధుసూదన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇళ్లు లేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థికసాయం, వంద శాతం సబ్సీడీపై మంజూరు చేసి స్వంత ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం కల్పించిందన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, కులం ధృవీకరణ, నివాస ధృవీకరణ పత్రం, బ్యాంక్‌ అకౌంట్‌ (జన్‌ ధన్‌ అకౌంట్‌ ఉపయోగించరాదు), వికలాంగులు ఐనట్లయితే సదరం సర్టిఫికెట్‌ పత్రాలను మండల పరిషత్‌ కార్యాలయంలో రేపటిలోగా ఆన్‌లైన్‌ ద్వారా కాకుండా మ్యాన్‌వల్‌గానే అందజేయాలన్నారు. అలాగే సొంత ఇంటి స్థలం కలిగి ఉండాలన్నారు. అర్హులైన లబ్ధిదారులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.