సమాచారం కోసం దరఖాస్తు

Apply for informationనవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం ఇవ్వాలని ఆర్టిఏ జిల్లా ప్రతినిధి రవీందర్ పంచాయతీ కార్యదర్శి కి శనివారం వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2018 నుండి 2024 వరకు సి ఎస్ ఆర్ నిధులు ఎన్ని వచ్చాయో కంపెనీల వారీగా ఇవ్వాలని, సి ఎస్ ఆర్ నిధులు ఉపయోగం, టెండర్లు, కాంట్రాక్టర్ల వివరాలు, లైసెన్స్ పత్రాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం దరఖాస్తు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టిఐ ప్రతినిధులు, తదితరులు ఉన్నారు.