అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి

నవతెలంగాణ – మోర్తాడ్

మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 6 సెమిస్టర్ కామర్స్ సబ్జెక్టు బోధించడానికి ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ పెద్దన్న తెలిపారు. ఈ సెమిస్టర్ బోధనకు పీజీలో 50 శాతం నెట్ సెట్ పిహెచ్డి బోధనలో అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆసక్తిగలవారు ఈనెల 21 3 2023 నాడు కళాశాలలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కాగలరని తెలిపారు ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా జిరాక్స్ సెట్ తో పాటు వర్జినల్ తో హాజరుకావాలని తెలిపారు.