జిల్లా గ్రంథాలయాల చైర్మెన్ల నియామకం

– ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని నాలుగు జిల్లా గ్రంథాలయాలకు చైర్మెన్లను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. హన్మకొండ జిల్లా గ్రంథాలయం చైర్మెన్‌గా మహ్మద్‌ అజీజ్‌ ఖాన్‌, జనగాం జిల్లా గ్రంథాలయం చైర్మెన్‌గా మరుజోడు రాంబాబు, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా గ్రంథాలయం చైర్మెన్‌గా బొంగునూరి శ్రీనివాస్‌రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయం చైర్మెన్‌గా మహ్మద్‌ అవాస్‌ అలియాస్‌ రహమాన్‌ను ప్రభుత్వం నియమించింది.