శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ ఛైర్మన్ గా చింతల దేవరాజ్ నియామకం

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలోని శనిగలగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ కమిటీ అధ్యక్షులు పాలకవర్గ సభ్యులుగా సోమవారం ఎన్నుకోవడం జరిగింది. ఆలయ కమిటీ అధ్యక్షులుగా చింతల దేవరాజ్ ధర్మకర్తల సభ్యులుగా అంతటి రవి గౌడ్, బోయ వెంకటేష్,వంగాల లింగస్వామి,ఆనగంటి లావణ్యలింగస్వామి లను గ్రామ పెద్దల సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. అనంతరం ఎన్నుకున్న అధ్యక్షులు చింతల దేవరాజ్ తో  పాటు పాలకవర్గ సభ్యులను ప్రమాణ స్వీకారం చేశారు. నూతన అధ్యక్షుడు చింతల దేవరాజ్ పాలకవర్గ సభ్యులను గ్రామ ప్రజలు శాలువలతో ఘనంగా సన్మానించారు. నూతన అధ్యక్షులు చింతల దేవరాజ్ మాట్లాడుతూ.. గుడి అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. నన్ను నాతోపాటు సభ్యులను ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బోయ దేవేందర్ ఎమ్మార్పీఎస్ నాయకులు బోయ లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు.