
నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలోని మేడారం, ఊరట్టం, కాల్వపల్లి గ్రామాలలో బుధవారం మంత్రి సీతక్క ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ మేడారం ఊరట్టం కాలపల్లి గ్రామాల క్లస్టర్ ఇంచార్జిలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు దేవేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు. గెలవగానే 6 గ్యారంటీలు అమలు చేశామని తెలిపారు. మహాలక్ష్మి పథకం, పేద మహిళలకు 500 కే వంట గ్యాస్ సిలిండర్, ఆర్టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు భరోసా, వ్యవసాయ కూలీలు భూమిలేని నిరుపేద రైతులకు ఏడాదికి 12,000, వరి కి ధరతో కింటాకు 500 రూపాయల బోనస్, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి పథకం, చేయుత ఇలా అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలన్నారు. సంక్షేమ పథకాలే మనల్ని స్థానిక ఎలక్షన్లో గెలవడానికి ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు జాలపు అనంతరెడ్డి, మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అర్రెం లచ్చు పటేల్, మాజీ ఎంపిటిసి బత్తిని రాజు, ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి వెంకన్న, మాజీ సర్పంచ్ సునీల్, సీతక్క యువసేన అధ్యక్షులు చెర్ప రవీందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.