దేవక్కపల్లి కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకం.. 

నవతెలంగాణ- బెజ్జంకి :
మండల పరిధిలోని దేవక్కపల్లి గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా పంజాల అజయ్ కుమార్ నియామకమయ్యారు. శుక్రవారం రెండో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి మండల నాయకులతో కలిసి అజయ్ కుమార్ కు నియామకపత్రమందజేశారు. నాయకులు చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, గూడెల్లి శ్రీకాంత్, మంకాల ప్రవీన్,గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు.