పల్లె దవాఖానకు డాక్టర్ నియామకం 

నవతెలంగాణ – రామగిరి 
రామగిరి మండలంలోని కల్వచర్ల  గ్రామ పల్లె దవాఖాన డాక్టర్ గా మూల దేవేందర్ రెడ్డి ని నియమించారు. గతంలో పనిచేస్తున్న దీరజ ఐదు నెలల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోయింది. గ్రామంలో డాక్టర్ లేక ఇబ్బందులు పడుతున్నామని, తాజా మాజీ సర్పంచ్ గంట పద్మ వెంకట రమణా రెడ్డి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు దృష్టి కి తీసుకువెళ్ళారు. సంబధిత అధికారులను ఆదేశించగా నూతన డాక్టర్ గా మూల దేవేందర్ రెడ్డినీ నియమించారు. ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ గంట పద్మ వెంకట రమణా రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ వేము కనకయ్యలు డాక్టర్ దేవేందర్ రెడ్డికి శాలువా కప్పి సన్మానం చేశారు. గ్రామస్తుల ఇబ్బందులు తెలిపిన వెంటనే స్పందించి నూతన డాక్టర్ నియమాకనికి కృషి చేసిన మంత్రి శ్రీధర్ బాబుకు సర్పంచ్ గంట పద్మ వెంకట రమణా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.