నవతెలంగాణ – జక్రాన్ పల్లి
సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణా రాష్ట్ర కో డైరెక్టర్ గా నిజామాబాద్ కు చెందిన డాక్టర్ బి.సుధాకర్ ను నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ అధికారికంగా నియమించారు. బుధవారం అబిడ్స్ లోని హోటల్ రీగల్ లో ఏర్పాటు చేసిన సమావశంలో జాతీయ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మానవ హక్కుల పరిర్షణకు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వానికి, పోలీసులకు తాము సహకారంగా ఉంటామని తెలిపారు. రాజ్యాంగము కల్పించిన హక్కులకు ఎవరైనా భంగం కలిగిస్తే జాతీయ మానవ హక్కుల కమిషన్ లో కేసు ఫైల్ చేసి నిజమైన భాదితులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ గా సుధాకర్ బాధ్యత గా పని చేసి న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు నుండి రాష్ట కార్యదర్శి గా బట్టి దత్తాద్రి గౌడ్ గారిని నియమించిడం జరిగిందన్నారు. అనంతరం సుధాకర్ మాట్లాడుతూ తన నియామకానికి సహకారం అందించిన నేషనల్ జనరల్ సెక్రెటరీ మామిడాల మనోహర్ గారికి, సౌత్ ఇండియా చైర్మన్ హన్మ గౌడ్ గారికి, రాష్ట్ర చైర్మన్ నోముల సంపత్ గౌడ్ గారికి ధన్యవాదములు తెలిపారు . నాకు అప్పగించిన భాద్యతలను బాధ్యతగా నిర్వహిస్తానని, భారత రాజ్యాంగానికి, చట్టానికి కట్టుబడి పని చేస్తానని ప్రమాణం చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ చైర్మన్ మధుకర్. రాష్ట్ర జనరల్ సెక్రెటరీ నవీన్ కుమార్, శివ ప్రసాద్, కే నారాయణ నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్ కొప్పు రాజేందర్, సుర్బిర్యాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.