నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణ బార్ అసోసియేషన్ హాల్ నందు సరసం చిన్నారెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో 2024-25 సంవత్సరానికి గాను ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల అధికారులుగా గటడి ఆనంద్, తాళ్ల శ్రీనివాస్ లను శుక్రవారం నియమించడం జరిగినది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అయినారి అశోక్, ఉపాధ్యక్షులు జగన్, కోశాధికారి అరుణ్, సంయుక్త కార్యదర్శి మధుసూదన్ రెడ్డి ,సీనియర్ న్యాయవాదులు లోక భూపతి రెడ్డి , కృష్ణ పండిత్, తులసీదాస్ క్రాంతి, చిలుక కిష్టయ్య ,రుయ్యడి రాజేశ్వర్,జక్కుల శ్రీధర్, బేతు జగదీష్, కృష్ణం రాజు, చిలుక సుభాష్ కుమార్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.