చౌటుప్పల్ మండల బీ.ఎస్.పి అధ్యక్షులుగా ఎర్ర దానయ్య నియామకం

Oplus_131072

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం పీపల్ పహాడ్ గ్రామానికి చెందిన ఎర్ర దానయ్య చౌటుప్పల్ మండల బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులుగా మంగళవారం ఎన్నికయ్యారు. నన్ను చౌటుప్పల్ మండలం అధ్యక్షునిగా ఎన్నికచేసిన నల్గొండ జిల్లా అధ్యక్షులు ఏరుకుల రాజారాం మునుగోడు నియోజకవర్గ బీఎస్పీ ఇన్చార్జ్ ఆందోజు శంకరాచారి, ఏర్పుల అర్జున్,పల్లె లింగస్వామి లకు కృతజ్ఞతలు తెలిపారు. బహుజన్ సమాజ్ పార్టీని మండల వ్యాప్తంగా గ్రామ గ్రామానికి బహుజన వాదాన్ని ముందుకు తీసుకెళ్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్. ఎస్.ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో బహుజనులం దరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని నూతన అధ్యక్షులు ఎర్ర దానయ్య పేర్కొన్నారు