టీటీడీ సభ్యురాలిగా గడ్డం సీత నియామకం

Appointment of Gaddam Sita as a member of TTDనవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యురాలిగా చేవెళ్ల పార్లమెంటు సభ్యులు రంజిత్‌రెడ్డి సతీమణి గడ్డం సీత నియమితులయ్యారు. 24 మంది సభ్యులతో కూడిన జాబితాను టీటీడీ విడుదల చేసింది. తెలంగాణ నుంచి గడ్డం సీతను ఎంపిక చేశారు. ఆమె పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే.