కాంగ్రెస్ పార్టీ చౌటుప్పల్ మండల ప్రధాన కార్యదర్శిగా గుండ్ల చంద్రశేఖర్ ముదిరాజ్ నియామకం

నవతెలంగాణ- చౌటుప్పల్ :చౌటుప్పల్ మండల కాంగ్రెస్ పార్టీ ఓబిసి ప్రధాన కార్యదర్శిగా గుండ్ల చంద్రశేఖర్ ముదిరాజ్ ను మంగళవారం నియమించారని చౌటుప్పల్ మండల ఓబిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్లెంకి వెంకటేష్ గౌడ్ తెలిపారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ నా నియమాకాన్ని సహకరించిన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్, రాష్ట్ర ఓబిసి అధ్యక్షులు నూతి శ్రీకాంత్ గౌడ్ లను కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండల ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, మండల యువజన సంఘం ఉపాధ్యక్షులు జొన్నగంటి మహేష్,జొన్నగంటి కిరణ్, గుండ్ల అశోక్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.