నియోజకవర్గ కాంగ్రెస్ సేవాదళ్ ప్రధాన కార్యదర్శిగా మహేందర్ రెడ్డి నియామకం

నవ తెలంగాణ- రాయపోల్
దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ ప్రధాన కార్యదర్శిగా రాయపోల్ మండలం మంతూర్ గ్రామానికి చెందిన గొర్రె మహేందర్ రెడ్డిని నియమించినట్లు సేవాదళ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ గాంధీ భవన్ లో నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా గొర్రె మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజక వర్గం సేవాదళ్ జనరల్ సెక్రెటరీ గా నియమించినంధుకు సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దేల జితేందర్ రెడ్డి కి, డిసిసి ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి కి సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు హనుమండ్లకాడి కిష్టారెడ్డి కి రాష్ట్ర ప్రదాన కార్యదర్శి గుర్రం శ్రీనివాస్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.