– రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు సభ్యులను నియమించింది. ఈమేరకు సోమవారం వ్యవసాయ, సహకార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, న్యాయవాది ఎం. సునీల్‌కుమార్ (హైదరాబాద్), రాంరెడ్డి గోపాల్‌రెడ్డి (ఖమ్మం),గడుగు గంగాధర్ (నిజామాబాద్), కేవీ నరసింహ్మరెడ్డి (నాగర్‌కర్నూల్), చెవిటి వెంకన్న యాదవ్ (సూర్యపేట్), మరికంటి భవాని తదిరులను సభ్యులుగా నియమించింది. ఈ కమిషన్ చైర్మెన్‌గా ఎం కోదండరెడ్డి ఉన్నారు.