మహముత్తారం మండలంలోని కొర్లకుంట గ్రామానికి చెందిన మొక్కర వెంకటస్వామి భూపాలపల్లి జిల్లా యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టిఐ (యు ఏఫ్) భూపాలపల్లి జిల్లా, కమిటీ సభ్యుడిగా, నియమించినట్లుగా ఆర్టిఐ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్,కాటారం సబ్ డివిజన్ కన్వీనర్,చింతల కుమార్ యాదవ్ లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు 2020 సంవత్సరంలో సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడుగా మండల కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహించి ప్రభుత్వ అధికారులలో ప్రశ్నించే గొంతుకై పనిచేసిన ముక్కర వెంకటస్వామిని ,సమాచార హక్కు చట్టం అర్జీల పెట్టి అవినీతి తావు లేకుండా పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఆయన కృషి చేశాడన్నారు.ఎన్నికైన వెంకటస్వామి మాట్లాడారు అవినీతి అక్రమాలు తావు లేకుండా అవినీతి పాలనకు అడ్డుకట్ట వేసేందుకు సమాచార హక్కు చట్టం ఒక ఆయుధంగా పనిచేస్తుందని నన్ను ఎన్నిక చేసినందుకు జిల్లా అధ్యక్షుల వారికి జిల్లా కమిటీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.