మండల మున్నూరు కాపు సంఘం కార్యవర్గాన్ని శుక్రవారం రోజున మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు తన్నీరు రాజేందర్ సంఘ సమావేశంలో ప్రకటించారు. అనంతరం కొత్త కార్యవర్గాన్ని అధ్యక్షులు తన్నీరు రాజేందర్, సీనియర్ నాయకులు ఎన్నికైన కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. అనంతరం తొలి కార్యవర్గ సమావేశం నిర్వహించి ఈ నెల చివరి వారంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంతో పాటు ఇన్సూరెన్స్ బాండ్లు సభ్యులందరికీ అందించాలని కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు తన్నీరు రాజేందర్, ప్రధాన కార్యదర్శి కొత్త మోహన్, కోశాధికారి ఆడువాల రవి, సహాయ కార్యదర్శి ఆకారి మహేష్, కార్యవర్గం సభ్యులు జంగిలి లక్ష్మణ్, పానగంటి లచ్చయ్య, కార్యవర్గ సభ్యులు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.