బీఎస్పీ అసెంబ్లీ నూతన అధ్యక్షుడి నియమాకం 

నవతెలంగాణ – బెజ్జంకి 
మండల పరిధిలోని రేగులపల్లి గ్రామానికి చెందిన మాతంగి తిరుపతి బీఎస్పీ మానకొండూర్ అసెంబ్లీ నూతన అధ్యక్షుడిగా నియమించినట్టు బీఎస్పీ జిల్లాధ్యక్షుడు దొడ్డే శ్రీనివాస్ తెలిపారు. అదివారం మానకొండూర్ మండల కేంద్రంలో బీఎస్పీ అసెంబ్లీ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించామని శ్రీనివాస్ తెలిపారు.తనపై నమ్మకంతో అసెంబ్లీ అధ్యక్షుడిగా నియమించిన బీఎస్పీ రాష్ట్ర,జిల్లా నాయకత్వానికి తిరుపతి కృతజ్ఞతలు తెలిపారు.