జాతీయ మానవ హక్కుల కమిటీ(ఎన్ హేచ్ ఆర్ సీ) జిల్లాద్యక్షుడిగా మండల పరిధిలోని వడ్లూర్ గ్రామానికి చెందిన జెల్లా చంద్రయ్య నియమించినట్టు రాష్ట్రాధ్యక్షుడు మొగుళ్ల భద్రయ్య తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని సత్యార్జునా గార్డెన్ యందు ఏర్పాటుచేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ మానవ హక్కుల కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్రాధ్యక్షుడు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య హజరై చంద్రయ్యకు నియమాక పత్రమందజేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా గాండ్ల సంతోష్,మండలాధ్యక్షుడిగా ఎల్కంటి తిరుపతి రెడ్డిని నియమించినట్టు భద్రయ్య తెలిపారు.