విద్యా కమిషన్ సలహా దారులుగా ఆర్.వెంకట్ రెడ్డి నియామకం

Appointment of R.Venkat Reddy as advisers of education commission– హర్షం వ్యక్తం చేసిన ప్రజా సంఘాలు
నవతెలంగాణ – భువనగిరి
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల విద్యాహక్కు పరిరక్షణ, బాల్య వివాహాల సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఉద్యమ నిర్మాణంలో గత రెండు దశాబ్దాలకు పైగా పనిచేస్తున్న ఎం.వి.ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్.వెంకట్ రెడ్డిని తెలంగాణా రాష్ట్ర విద్యా కమిషన్ సలహాదారులుగా  నియామకం పట్ల జిల్లా బాలల హక్కుల పరిరక్షణ వేదిక ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ శనివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అమ్మ ఆదర్శ కమిటీల సభ్యులు ఎర్ర శివరాజ్ కొడాలి వెంకటేష్, ప్రకటనలో పలు అంశాలను ప్రస్తావించారు. ఆర్. వెంకట్ రెడ్డి పిల్లల విద్య కోసం తెలంగాణ తో పాటు  జాతీయ స్థాయిలో స్వచ్చంద సంస్థలతో  అంతర్జాతీయంగా “స్టాప్ చైల్డ్ లేబర్ కాంపెయిన్” భాగస్వామ్య దేశాలైన ఉగాండా, కెన్యా, ఇథియోపియా, ఘన, మాలి, మొరాకో తదితర దేశాల్లో ఆయన పని చేసారని తెలిపారు. ప్రత్యేక  తెలంగాణ రాష్ట్ర సాధన  ఉద్యమం లో రాష్ట్రంలోని సామాజిక కార్యకర్తలను  ఒక వేదికగా ఏర్పాటు చేసి  చురుకైన పాత్ర పోషించారన్నారు.  బాలల పక్షపాతిగా ఉంటూ నాణ్యమైన విద్య పిల్లల హక్కు అని, పిల్లలు మన జాతీయ సంపద అంటూ , నిరంతరం పిల్లల కోసం పనిచేస్తున్న ఆర్. వెంకట్ రెడ్డి  సేవలను  గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్ సలహాదారులుగా నియమించిదన్నారు. హర్షం వ్యక్తం చేసిన వారిలో  ఆవుల వినోద్ కుమార్, బొక్క రాంబాయి, వగ్గు క్రిస్టోఫర్, పురుషోత్తం  హర్షం వ్యక్తం చేశారు.