మండలానికి స్పెషల్ ఆఫీసర్లు నియామకం..

నవతెలంగాణ – ఆత్మకూర్ (ఎస్)
గ్రామ పంచాయితీలలో సర్పంచ్ ల పదవీ కాలం జనవరి 31 నాటికి ముగియడంతో వారి స్థానాల్లో గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించారు. గురువారం నుండి ఆత్మకూరు మండలంలో ప్రత్యేక అధికారులను కేటాయించారు. మొత్తం 30 గ్రామ పంచాయతీలకు 14 మంది ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించారు. నిమ్మికల్ గట్టికల్లు, పీపా నాయక్ తండా గ్రామాలకు ఎంపీడీవో మల్సూర్ నాయక్, ఆత్మకూర్ బోరింగ్ తండాలకు తహాసిల్దార్ సిహెచ్ కృష్ణయ్య, తుమ్మలపెన్ పహాడ్ బోట్య తండా లకు ఎంపీఓ సంజీవయ్య, పాత సూర్యాపేట దుబ్బ తండాలకు వ్యవసాయ అధికారి దివ్య, కందగట్ల మంగళ్ తండా కు ఎంఈఓ దారా సింగ్, బొప్పారం ఏపూరి తండా డిప్యూటీ తహాసిల్దార్ పుష్ప, ఏపూరు కాచిగూడ తండా కు పంచాయతీరాజ్ ఏఈ బాబురావు, పాతర్లపాడు కొత్త తండాకు వెటర్నరీ అధికారి వేణుగోపాల్ ,కోటపాడు శెట్టిగూడెం అసలా తండా లకు వెటర్నరీ అధికారి ఏ వెంకన్న, రామన్నగూడెం రామోజీ తండాకు ఇరిగేషన్ డి ఈ నగేష్ ముక్కుడుదేవులపల్లి ఇస్తలాపురం గ్రామాలకు ఇరిగేషన్ ఏఈ రామారావు, మక్తా కొత్తగూడెం మిడతనపల్లి  గ్రామాలకు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రవికుమార్, దాచారం నసీంపేట గ్రామాలకు సిహెచ్ఓ వెంకటేశ్వర్లు, ఏనుబాముల కోటి నాయక్, తండలకు ఎంపీడీవో, కార్యాలయ సూపరిండెంట్, దయాకర్ రెడ్డిలను నియమిస్తూ గురువారం జిల్లా పంచాయతీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.