– డీఎంఈ నోటిఫికేషన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో బోధనా సిబ్బంది నియామకానికి రాష్ట్ర వైద్యవిద్యా సంచాలకులు డాక్టర్ కె.రమేశ్ రెడ్డి గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏడాది కాలానికి తాత్కాలికంగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన రాష్ట్రంలోని తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని 8 విభాగాల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 15 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించారు. ఈ నెల 20న ఉదయం 10 గంటలకు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లకు, మధ్యాహ్నం 12 గంటలకు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు కౌన్సిలింగ్ ఉంటుంది. ఎంపికైన వారు నవంబర్ ఒకటిలోపు విధుల్లో చేరాల్సి ఉంటుంది.