
నవతెలంగాణ – మద్నూర్
బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో బూత్ అధ్యక్షుల ఎంపిక కార్యక్రమాలు చేపడుతుంది. ఈ కార్యక్రమాలు భాగంగా బిజెపి మండల పార్టీ అధ్యక్షులు తేప్పవార్ తుకారం ఆదివారం నాడు మద్నూర్ మండలంలోని తడి ఇప్పర్గా గ్రామంలోని మూడు నాలుగు బూతులకు నూతన అధ్యక్షులుగా లింగురాం, ప్రకాష్ లను ఎంపిక చేయడం జరిగిందని మండల పార్టీ అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తెప్పవార్ తుకారం, కృష్ణ పటేల్ , తులావార్ సంతోష్ , పి సునీల్ దేశాయ్, మోహన్, తదితరులు పాల్గొన్నారు.