వీఆర్ ఏ లకు నియామక పత్రాలు జారీ చేయాలి

Appointment papers should be issued to VRAsనవతెలంగాణ – ముధోల్
61 ఏండ్లు పైబడిన వీఆర్ఎల వారసులగా తమకు వెంటనే నియామక ఉత్తర్వులు జారీ చేసి,  వెంటనే రెగ్యుల రైజ్ చేయాలని వీఆర్ఏలు నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లోని తాసిల్దార్ కార్యాలయం తహసీల్దార్ శ్రీకాంత్ కు శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గతప్రభుత్వ జీవో 81, 85, ప్రకారం రాష్ట్రంలో 3797 మంది పైబ డిన వీఆర్ఎల వారసులు అర్హులుగా గుర్తించింది అన్నారు .ఆయా జీవోలపై స్టే ఉన్న కారణంగా నియామక పత్రాలను ఇప్పటి వరకు అందజేయలేదన్నారు. అయితే  21నవంబర్ 2023 సంవత్సరంలో  హైకోర్టు డివిజన్ బెంచ్ జీవో 81 పై స్టేను తొలగించారని వారు పేర్కొన్నారు.అప్పటి నుండి తహసీల్దార్ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్నా మన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిలోనూ తమవంతుగా సేవల అందిస్తున్నామన్నారు. కాగా ఆర్థిక పరిస్థితుల కారణంగానే 17 మంది వీఆర్ఎలు మరణించారని ఆరోపించారు. కాబట్టి ఇప్పటికైనా తమను గుర్తించి, నియామక పత్రాలు అందజేయాలన్నారు. కార్యక్రమంలో ముత్యం, దశరథ్, పోతన్న, నవీన్, భూమన్న, ముత్యం,తది తరులు, పాల్గొన్నారు.