నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : తెలంగాణ మాదిగ ఉద్యోగుల సమాఖ్య జిల్లా కమిటీని నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా మాదిగ ఉద్యోగులు సమాఖ్య జిల్లా అధ్యక్షులు మహేష్, ప్రధాన కార్యదర్శిగా కొండపల్లి సురేష్ నియమించారు. ఈ సందర్భంగా ఎమ్మోర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ వారికి ఉత్తర్వుల పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షా, కార్యదర్శి మాట్లాడుతూ నియామకానికి మంద దేవేందర్ మాదిగ, రవి వర్ధన్ కృష్ణయ్య కృతజ్ఞాతలు తెలిపారు.