పోలీసుల సేవలు అభినందనీయం: పింజా అశోక్

నవతెలంగాణ – ఆర్మూర్
నేరాల నియంత్రణకై అహర్నిశలు శ్రమించే పోలీసుల సేవలు ఎంతో అభినందనీయమని మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు పింజా అశోక్ అన్నారు. పట్టణ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రవికుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం పూలమాల చాలువాతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో, నరేష్, సాయి, వెన్న రమేష్ తదితరులు పాల్గొన్నారు.