అత్యవసర సమయంలో రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్న కౌన్సిలర్.. సోమవారం వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి, గొల్లపల్లికి చెందిన కొడుకుల సుజాత అనే గర్భవతి కి రక్తదానం చేసిన 27 వార్డ్ కౌన్సిలర్ గోలి మహేష్ 32వ సారి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. వేములవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళలకు ఏ పాజిటివ్ రక్తాన్ని సిరిసిల్ల బ్లడ్ బ్యాంకులో అందించి ప్రాణాన్ని నిలబెట్టారు. తోటి కౌన్సిలర్లు, పట్టణ ప్రజలు ఆపదలో ఉన్న మహిళకు రక్తదానం అందించిన మహేష్ ని డాక్టర్, పలువురు అభినందించారు. అత్యవసర సమయంలో రక్తదానం చేసిన మహేష్ కి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.