చిత్రలేఖనం పోటీల్లో విద్యార్థులకు ప్రశంసలు..

Appreciation for students in painting competitions..నవతెలంగాణ – ఏర్గట్ల
ఏర్గట్ల ప్రభుత్వ పాఠశాలకు చెందిన 17 మంది విద్యార్థులు జాతీయస్థాయి చిత్రలేఖనం పోటీల్లో పాల్గొని రామాయణం ఇతివృత్తంగా చక్కని బొమ్మలు గీసినందుకు గాను ప్రశంసలు అందుకున్నట్లు తెలుగు పండితులు ప్రవీణ్ శర్మ తెలిపారు. హైదరాబాద్ కు చెందిన కాసుల చిత్రకళ అకాడమీ వ్యవస్థాపకురాలు పద్మావతి ఆధ్వర్యంలో గత జులై,ఆగస్టు నెలలో ఈ పోటీలు జరిగాయని అన్నారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసలతో పాటు  జాతీయస్థాయిలో గుర్తింపు దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణాచారి,ఉపాద్యాయుల బృందం విద్యార్థులను,తెలుగు పండితులు ప్రవీణ్ శర్మను,గంగాధర్ ను అభినందించారు.