నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్: హుస్నాబాద్ ఆర్టీసీ ఆదర్శ ఉద్యోగులకు మంగళవారం ఆర్టీసీ డిపో లో మేనేజర్ వెంకటేశ్వర్లు అభినందన సభ ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులందరూ కష్టపడి హుస్నాబాద్ డిపోను లాభాల బాటలో తీసుకురావాలని కోరారు. డ్రైవర్, కండక్టర్స్ లు ముఖ్యంగా సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని ఉద్యోగులకు పలు సూచనలు చేశారు. అక్టోబర్ 2023 మాసంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు సన్మాన పత్రాలు అందజేశారు. అత్యధిక ఆదాయం తీసుకు వచ్చిన డ్రైవర్, కండక్టర్స్ కి నగదు బహుమతులు అందజేశారు. వివాహ శుభకార్యాలకు బస్ లు బుకింగ్ చేపించిన ఉద్యోగులకు నగదు బహుమతులు అందజేస్తమని తెలియజేపారు. శబరి మలకి 2 సూపర్ లగ్జరీ బస్సు లు బుకింగ్ చెపించాలని చెప్పారు. ఇదే స్ఫూర్తితో రానున్న మంచి రోజులల్లో అత్యధికంగా బస్ లని బుకింగ్ చేపించి, డిపో ఆదాయం పెంచుటలో మి వంతు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపో సూపర్డెంట్ శ్రీధర్, అకౌంటెంట్ లక్ష్మా రెడ్డి, ఏఎంఎఫ్ సమ్యూల్ ఉద్యోగులు పాల్గొన్నారు.