ఉత్తములకు ప్రశంస పత్రాలు..

– కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందజేత
నవతెలంగాణ- తాడ్వాయి
మండలంలో వివిధ రంగాల్లో తనదైన శైలిలో విశిష్ట సేవలు అందించినందుకు గాను స్థానిక తాసిల్దార్ తోట రవీందర్ కు, ఓటర్ నమోదులో బిఎల్ఓ గా విశేష సేవలందించినందుకు అంగన్వాడి కేంద్రాల్లో ఉత్తమ సేవలు అందించినందుకు గాను నార్లాపూర్ అంగన్వాడి2 సెంటర్ అంగన్వాడి టీచర్ ఊకే అనసూర్య లకు శుక్రవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ జిల్లా ఇలా త్రిపాఠి, జిల్లా అధికారులు ల చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. పాలన పాటించి సక్రమంగా విధులు నిర్వర్తించిన ఉత్తమ ఉద్యోగులకు ప్రభుత్వం గుర్తించి కలెక్టర్ చేతుల మీదుగా అందించినందుకు మండల అధికారులు, వివిధ పార్టీల నాయకులు ప్రశంసించాయి.