
– మంత్రి సీతక్క చేతుల మీదుగా అవార్డు అందజేత
నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలో వివిధ రంగాల్లో తనదైన సెల్లులో ఇష్క్శేరు అందించిన గాను స్థానిక తాసిల్దార్ తోట రవీందర్ కు గురువారం జిల్లా కేంద్రంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. తాసిల్దార్ స్థానికంగా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి, ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నందుకు తాడ్వాయి తహసిల్దార్ తోట రవీందర్ కు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అందించారు. అంతేకాకుండా మండల అభివృద్ధి అధికారి సుమన వాణి, పోలీస్ శాఖ నుండి హెడ్ కానిస్టేబల్ డి వెంకటేశ్వర్లు, విద్య శాఖ నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ సంధ్య, ఎం ఆర్ సి భవన్ ఉంది నీలం బాబు, హెల్త్ నుండి కొడిశల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ అసిస్టెంట్ మంజుల, ఎంపీఎస్ఓ జి శ్రీనివాస్, విద్యుత్ శాఖలో సబ్ ఇంజనీర్ జ్ఞానేశ్వర్ మండలంలోని వివిధ శాఖలకు చెందిన అధికారులకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డులు అందజేశారు. సక్రమంగా విధులు నిర్వహిస్తున్న ఉత్తమ ఉద్యోగులకు ప్రభుత్వం గుర్తించి మంత్రి చేతుల మీదుగా అవార్డు అందించినందుకు మండల అధికారులు, వివిధ పార్టీల నాయకులు ప్రజాసంఘాల నాయకులు, మండల ప్రజలు ప్రశంసించారు.