న్యూఢిల్లీ : ఫైనాన్సీయల్ సొల్యూషన్స్ సంస్థ శ్రేష్టా ఫిన్‌వెస్ట్ రూ.49 కోట్ల నిధుల కోసం రైట్ ఇష్యూను జారీ చేయడానికి తమ సంస్థ బోర్డు ఆమోదం తెలిపిందని తెలిపింది. ఇందుకోసం రూ.2 ముఖ విలువ కలిగిన షేర్లను జారీ చేయనున్నట్లు పేర్కొంది. ఫైనాన్స్ సొల్యూషన్స్ అందించే ఈ సంస్థ ప్రతిపాదనలకు రెగ్యూలేటరీ సంస్థల నుంచి ఆమోదం లభించాల్సి ఉంది.