ఏపీఎస్‌ ‘సేంద్రీయ తేనె’ ఆవిష్కరణ

న్యూఢిల్లీ: ప్రముఖ ఎఫ్‌ఎంసిజి కంపెనీ ఎపిఎస్‌ ఇండియా లిమిటెడ్‌ తాజాగా సేంద్రీయ తేనెను అందు బాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. దీన్ని బాలీవుడ్‌ నటీ సాన్యా మల్హోత్రా ఆవిష్కరించారు. ”నేడు మా నిబద్ధతను ఒక అడుగు ముందుకు తీసుకెళుతూ.. సేంద్రీయ తేనెని అందజేస్తున్నాము. ఇది తేనెటీగలు, పర్యావరణం. ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునే వినియోగదారులకు మేము ఇచ్చిన వాగ్దానం.” అని ఏపిఎస్‌ ఇండియా ఎండి అమిత్‌ ఆనంద్‌ పేర్కొన్నారు.