
ఆప్తుల మరణం అత్యంత బాధాకరం అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు మిషన్ శిక్షణ శిబిరంలో ట్రైనరుగా పనిచేస్తున్న పెర్కవేడు గ్రామానికి చెందిన గొడుగు స్వప్న అనారోగ్యంతో మరణించగా ఆమె భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు వీరగండం సుబ్బారావు మరణించగా వారి కుటుంబాన్ని, రాయపర్తి మాజీ సర్పంచ్ ఐత ఉప్పలయ్య కుమారుడు రిటైర్డ్ ఆర్మీ సైనికుడు ఐత యాకయ్య అకాల మరణం చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండే వ్యక్తులు అకాల మరణం చెందడం బాధిత కుటుంబానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉంటా అని హామీ ఇచ్చారు. ఆయనతోపాటు మండలాభివృద్ధి కమిటీ చైర్మన్ బిల్లా సుధీర్ రెడ్డి, సర్పంచులు చిన్నాల తారశ్రీ రాజబాబు, గారె నర్సయ్య, ఎంపీటీసీలు బండి అనూష రాజబాబు, ఐత రాంచందర్, బిల్లా రాధిక సుభాష్ రెడ్డి తదితరులు ఉన్నారు.