
మండలంలోని మామిడిపల్లి గ్రామ శివారులో గల అపురూప వెంకటేశ్వర ఆలయంలో సప్తాహ్నిక పుష్కర బ్రహ్మోత్సవాలు భాగంగా ఆరవ రోజు కళ్యాణ మహోత్సవం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం శాంతిపాఠము, వేదాది విన్నపములు, ద్వారతోరణ ధ్వజకుంభ ఆరాధన, మూర్తి కుంభ ఆరాధన, పంచసూక్త హోమం, పూర్ణాహుతి, శ్రీ భూ సమేత అపురూప వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం, నివేదన, బలిహరణ, మంగళాశాసనం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, యాగశాలార్చనలు, పూర్ణా హుతి, గరుడ వాహనము, నివేదన, బలిహరణ, నీరాజనం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్పర్సన్ అమృత లత, కమిటీ సభ్యులు, రమాదేవి, శ్రీనివాస్ రెడ్డి, రమణ రెడ్డి, అర్చకులు, ప్రజలు పాల్గొన్నారు.